top of page

KAMADRI

పృథ తెరిచిన పుటల | కుంతి అంతరంగ కథనం | వేలూరి కృష్ణమూర్తి

Price

₹215.00

Safe & Secure Delivery

మమకారమనే సర్పపు సంకెళ్ళ చక్రంలోనుండి మానవుని మనసు బయట పడడం ఎంత కష్టం! సంకెళ్ళను విడిపించుకొని దూరంగా పారవేశాననే భ్రమలో పది అడుగులు ముందుకు వేయునంతలో వెనుకనుండి పొంచి, కాచుకొని, మరలా వచ్చి గట్టిగా పట్టివేస్తుందది! నా బిడ్డల నీతి, నిష్ఠల కారణంగా చివరికి గౌరవం దక్కి, వారు సామ్రాజ్యశాలురైనపుడు, నా భుజాలమీద వున్న భారం దిగిపోయిందని సమాధానపడ్డా. అంతమాత్రమే కాదు, వారితో పదహైదు సంవత్సరాలు రాజభవనంలోనే గడిపా. సాధ్యమైనంత సమయం ధృతరాష్ట్రుడు, గాంధారి కూడ మా వద్దనే వున్నారు, అయితే, వారు పుత్ర శోకంతో నిరంతరం తపించి, చివరికి శాంతిని వెదుకుతూ అడవికి వెడుదామని నిర్ణయించినపుడు, నా మనసు కూడా వారితో వెళ్ళి వారి సేవలో మిగిలిన జీవితం గడపాలని నిర్ణయించింది. రాజమందిరపు వైభోగాలతో సుఖంగా పట్టెమంచం మీద విశ్రమించి, దాస-దాసీలనుండి పొందే శారీరిక సుఖాలకన్నా, అడవిలో కంద మూలాలు తింటూ జడలు ధరించి సేవాతత్పరురాలినవ్వడంలోనే నా జీవితానికొక విశిష్టమైన అర్ధం వున్నదని ఆలోచించి, బిడ్డలు ఎంత అడ్డు చెప్పినా యికముందు అంతఃపురంలో వుండడానికి నిరాకరించి దృతరాష్ట్రుడు, గాంధారి, వారివెంట బయలుదేరిన విదురుడు, సంజయులను అనుసరించి నేను కూడ బయలుదేరి వచ్చేశా!

అడవిలో గడిపిన ఈ ఒక్క సంవత్సరంలో, బిడ్డలపై వున్న వ్యామోహం త్రుంచి వేసినట్టు, వెనుకటి జ్ఞాపకాలు తుడిచిపోయినట్టే అనిపించింది. ఈ నా మూడవ వనవాసంలో ఎలాంటి చిక్కులు, చింతలు వుండలేదు. ఇంతకు మునుపు పాండు-మాద్రిలతో అరణ్యంలో వున్నపుడు పాండుకు కలిగిన శాపపు వ్యథ నన్ను క్రుంగదీసేది. నా బిడ్డలతో లక్కయింటినుండి తప్పించుకొని అడవులలో తిరుగుతూ గడిపిన ఆ రోజులు ఆదుర్దా తోనూ, భయంతోనూ నిండి వుండేవి. కాని, ఇప్పుడు? నా సహజీవులకు నావల్ల కొంతైనా సహాయం కలుగుతున్నదనే ప్రజ్ఞ, ఇంతకు ముందెపుడూ దొరకని ఉల్లాసం, శాంతిని కలిగించసాగాయి..................................

Quantity

bottom of page