

Swecha Kosam Sudeergha Prayanam | Rapolu Seetharamaraju
₹400.00
₹360.00
Safe & Secure Delivery
రాపోలు సీతారామరాజు గత దశాబ్దకాలంగా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నాడు. అక్కడి నేల, అక్కడి గాలి, అక్కడి సంస్కృతిని ఎప్పటికప్పుడు తన అనుభవంలో సంలీనం చేసుకుంటూ, అక్కడి మనుషుల మధ్య జీవిస్తూ సీతారామరాజు చేసిన ఈ అనువాదం అతని రచనాజీవితంలో ఒక మేలిమలుపు. మండేలా గురించి మాత్రమే కాక దక్షిణాఫ్రికా చరిత్ర, నైసర్గికత, రాజకీయాలు, నేటి యువత ఆలోచనలు ఎన్నో చెప్పిన తీరులో ఓ క్రమం ఉంది. రచయిత అక్కడి ప్రాంతాల పేర్లు, మనుషుల పేర్లు వారి ఉచ్చారణకు అనువుగా రాశాడు. వాళ్ళ భాషలోని, సంస్కృతిలోని, చరిత్రలోని, పోరాటంలోని జీవధాతువును తన అక్షరాల్లోకి తీసుకురావడంలో సఫలమయ్యాడు. ఈ పుస్తకాన్ని చదవడం ఓ ఉద్విగ్నపూరిత అనుభవం. ఒక మంచి పాఠకుడిగా, రచయితగా సీతారామరాజు వివిధ ప్రక్రియలతో చక్కని అనుబంధాన్ని పెంచుకున్నాడు. అందరి అవగాహనకు చేరువ కాగలిగే వాక్యనిర్మాణ నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నాడు. అనువాద గ్రంథాలకు ఉండే పరిమితులు లోతుగా తెలిసి, ఎంచుకున్న విషయంలోని లక్ష్యాన్ని పాఠకులకు పూర్తిగా చేరవేయాలనే తపనతో చేసిన కృషి ఇది.
Quantity