



Katha 2023-24 | కథ | Mulkanooru Sahithi Peetam Namaste Telagnana KATHALA POTI
₹440.00
Safe & Secure Delivery
నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి 2023-24 కథల పోటీల విజేత కథల సంకలనం.
ఐదు వసంతాల పవిత్ర క్రతువు..
కలకాలం సుగంధించే సృజనాత్మకతకు నెలవు..
మనం అనుకున్న గమ్యానికి ఒక్క సంవత్సరమైనా చేరుతామా? లేదా? అనే మీమాంస నుంచి ఐదు సంవత్సరాలు సాగిన అందమైన కథా ప్రయాణం మాకు గొప్ప సంతృప్తినిస్తుంది. ముల్కనూరు సాహితీ పీఠం- నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ క్రతువుకు రచయితలే యాగ్నికులు. పాఠకులే యజమానులు. తెలుగు కథ తల్లికి మకుటాన్ని తొడగడం మాకు దక్కిన అదృష్టం. ఇది మాకెళ్లప్పుడూ చెప్పలేని ఆనందం.
ఈ ఐదేండ్లలో సుమారు నాలుగు వేల కథలు వచ్చాయి. వాటిలో నుంచి మా న్యాయ నిర్ణేతలు సుమారు 300 కథలకు బహుమతుల ద్వారా పట్టం కట్టారు. ఈ యజ్ఞంలో సుమారు ఎంతో మంది లబ్దప్రతిష్టులైన కథకులే కాకుండా.. మొదటి సారి రాసిన కథకే బహుమతి పొందిన యువ కథకులు కూడా పాలుపంచుకున్నారు. సమాజ బాగులో కీలకంగా మారే సాహిత్యపు పాత్ర చెప్పాల్సిన అవసరం లేదు. నేటి తెలుగు సాహిత్య ప్రపంచంలో కథకే పెద్ద పీట. పదినిమిషాల్లో కథను చదివిన పాఠకుడు పది కాలాల పాటు కథావస్తువును, శైలిని గుర్తుంచుకుంటే ఆ కథకు, కథకునికి సార్థకత. కథ 2023 - 246 ^ 6 అలాంటి కథలు అనేకం.
Quantity